AMARAVATHIDISTRICTS

2025 నాటికి నాయుడుపేట-రేణిగుంటల మధ్య 6 వరుసల రహాదారి పూర్తి- నితిన్ గడ్కరీ

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం, ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు గల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నివ్వడం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. గురువారం స్థానిక ఎస్ వి యునివర్సిటీ స్టేడియంలో రాష్ట్రంలో కొత్తగా 3 జాతీయ రహదారులకు శంఖుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కృష్ణ పట్నం పోర్టు కు కనెక్టివిటీ ప్యాకేజ్ 2,3,4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్ విధానంలో శంఖుస్థాపన చేసి అనంతరం అయన ప్రసంగిస్తూ 2014 లో మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటికి ఆంద్ర ప్రదేశ్ లో 4193 కిమీ జాతీయ రహదారులు వుంటే, నేడు  2023 నాటికీ 8744 కిమీ లకు చేరి దాదాపు రెండింతల నిర్మాణాలు జరిగాయన్నారు. మౌలిక సదుపాయలతోనే నిరుద్యోగ నిర్మూలన చేయగలం అని నమ్మిన మన ప్రధాని నరేంద్ర మోడీ నీరు, విద్యుత్, రహదారులు, కమ్యునికేషన్ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు.

17 వేల కోట్లతో పనులు:- ఒక్క తిరుపతి జిల్లాలోనే రూ.17 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని 2024 నాటికీ పూర్తీ కానున్నాయన్నారు.. ఇప్పటికే రూ.4 వేల కోట్లతో పనులు పూర్తీ అయ్యాయని, మరో రూ.13 వేల కోట్లతో జరుగుతున్న కడప-రేణిగుంట, తిరుపతి–మదనపల్లి, రేణిగుంట–నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు 2025 నాటికి పూర్తీ కానున్నాయన్నారు. కృష్ణపట్నం పోర్ట్  సమీపంలో నాయుడుపేట- తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి 35 కి.మీ రూ.1399 కోట్లు, చిల్లకారు క్రాస్ నుండి తూర్పు కానుపూరు వరకు 4 లేన్ల రహదారి అలాగే తూర్పు కానుపూరు నుంచి కృష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ 6 లేన్ల రహదారి 36 కి.మీ రూ. 909 కోట్లు, తమ్మినపట్నం నుంచి నారికెళ్లపల్లెను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 4 లేన్లు,  పోర్ట్ రోడ్డు పొడిగింపు 6 లేన్ల రహదారి 16 కి.మీ రూ. 610 కోట్లు తో నేడు శంఖుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *