AMARAVATHIEDUCATION JOBS

10వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత-మంత్రి బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు..శనివారం విజయవాడలోని SSC బోర్డు కార్యాలయంలో ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్, విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి బొత్సా 2022-2023 ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు..ఈ పరీక్షల్లో మొత్తం 72.26 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలికలదే పైచేయి అన్నారు..ఉత్తీర్ణత సాధించిన జిల్లాలో టాప్ లో పార్వతి పురం మన్యం జిల్లా ఉండగా చివరిస్థానంలో నంద్యాల జిల్లా ఉందని తెలిపారు..ఉత్తీర్ణతలో బాలురు 69.27 శాతం ఉండగా బాలికలు 75.38 శాతం మంది ఉన్నారని వెల్లడించారు..బాలురు కంటే బాలికలు 6.11 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు మంత్రి బొత్సా అభినందనలు తెలిపారు..

జూన్ 2 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు..మొత్తం 933 పాఠశాలల్లో  100శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు..ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగిన 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807మంది ఉన్నారన్నారు..

జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని,,సప్లిమెంటరీ పరీక్షలకు May 17వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు..రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు  మే 13 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in లో చూడవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *