AMARAVATHIDEVOTIONAL

శరవేగంగా జరుగుతున్న నిర్మాణం పనులు- పూర్తి కావస్తున్నఅయోధ్య రామ మందిర నిర్మాణం

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులతో పాటు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో, రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి..ఆలయం నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయని,,ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం సోమవారం విడుదల చేసింది..ఆలయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపింది..గ్రౌండ్ ఫ్లోర్ పనులు నవంబరు నాటికి పూర్తి అవుతాయని,,మొదటి అంతస్తులో 50 శాతం పనులు పూర్తైనట్లు తెలిపింది..డిసెంబర్ చివరి నాటికి మొదటి అంతస్తు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది..2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే..జనవరి 21 నుంచి 23వ తేదీల మధ్య నిర్వహించే రాముడి విగ్రహప్రతిష్టాపనకు దేశ నలమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాలతో,,ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *