AMARAVATHIDISTRICTS

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పనులను పర్యవేక్షిస్తున్నామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ తెలియజేసారు. స్పెషల్ డ్రైవ్ జరుగుతున్న 4వ డివిజన్ శ్రీరామ నగర్ కాలనీ ప్రాంతంలో పూడికతీత పనులను డాక్టర్ శనివారం పర్యవేక్షించారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు, కవర్లు వేయడం వల్ల పారుదలకు అంతరాయం కలిగి దుర్వాసన వ్యాపిస్తుందని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణం దోమల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని, వివిధ అంటు రోగాలకు కారణమవుతుందని డాక్టర్ వివరించారు. పూడికతీత పూర్తయిన వెంటనే సిల్ట్ మురుగు మొత్తాన్ని వాహనాల ద్వారా తరలించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పూడికతీత పనులను అన్ని డివిజనుల్లో నిరంతరం పర్యవేక్షించేలా సచివాలయ శానిటేషన్ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసామని డాక్టర్ తెలియజేసారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయరాదని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని డాక్టర్ వెంకట రమణ సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *