AMARAVATHINATIONAL

G-20 శిఖరాగ్ర సదస్సుకు సుందరంగా ముస్తాబైన ఇంద్రప్రస్థ

అమరావతి: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా నిలిచిన G-20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఇంద్రప్రస్థ సుందరంగా ముస్తాబైంది..శని,ఆదివారల్లో జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..అంతర్జాతీయ ఆర్థిక అంశాలతో పాటు ప్రపంచీకరణ అనే ఆంశం బలోపేతం అయ్యేందుకు G-20 దేశాల కూటమి కీలక పాత్ర పోషించనున్నది.. ప్రపంచ దేశాల ఆర్థిక సహకారానికి కీలక వేదికగా నిలిచే G-20 దేశాలు ప్రతిష్ఠాత్మక నిర్వహించే సదస్సుకు తొలిసారి విశ్వగురూ భారత్ ఆతిథ్యమిస్తోంది..అతిథుల భద్రత నుంచి ఆతిథ్యం వరకు అన్నింటిని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది..ప్రగతి మైదాన్ లో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్ లో ఉన్న భారత్ మండపంలో శిఖరాగ్ర సదస్సు జరగనుంది..ఈ మండపాన్ని లైటింగ్స్, వివిధ కళా అకృతుల పెయింటింగ్స్ తో అలంకరించారు..మండప ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన నటరాజ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది..భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు..G-20 దేశాల సమావేశం ఒకవైపు,,,సదస్సు నిర్వహణ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు మరోవైపు..దేశ రాజధాని ఇప్పుడు కనీవినీ ఎరుగని భద్రతా వలయంలోకి వెళ్లింది..కీలక ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు, సైన్యం, నిఘా విభాగం ఢిల్లీని పహరా కాస్తున్నాయి..G-20 సదస్సులో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సమావేశం కానున్నారు..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై నేతలు చర్చించనున్నారు.. రెండు రోజులపాటు జరిగే G-20 సదస్సు కోసం ఇప్పటికే అమెరికా నుంచి బయలుదేరిన బైడెన్ సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు..G 20 సదస్సు కోసం భారత్ వచ్చే తొలి అతిథిగా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ నిలవనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *