AMARAVATHIPOLITICS

రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన సంగ్మా

ప్రధాని,హోం మంత్రి..

అమరావతి: సెవన్ సిస్టర్స్ స్టేట్స్ గా పిలవబడే ఈశాన్యం రాష్ట్రం అయిన మేఘాలయలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది.. మేఘాలయలో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ, భారతీయజనతాపార్టీ, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ,ఇండిపెండెంట్‌లతో కలిసి ఎన్‌పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి  మేఘాలయ డెమొక్రటిక్‌ అలయన్స్‌ 2.0’ గా నామకరణం చేశారు..మొత్తం 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో,కూటమి సభ్యుల బలం 45 ఉంది..

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా చేత మంగళవారం గవర్నర్ ఫఘు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు..ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు..కన్రాడ్ సంగ్మా వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కేబినెట్‌ మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు..NPPకి చెందిన ప్రిస్టోన్ టైన్‌సాంగ్,, స్నియావ్‌భలాంగ్ ధర్‌లు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు..బీజేపీ నుంచి అలెగ్జాండర్ లాలూ హెక్,, UDPకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, HSPDPకి చెందిన షక్లియార్ వార్జ్రీ మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం NPP నుంచి 7గురు, UDP నుంచి 2, BJP నుంచి 1, HSPDP నుంచి 1 MLA సంగ్మా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *