AMARAVATHIDEVOTIONAL

సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది-టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వామివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తినిచ్చాయ‌ని వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం వైవి మీడియాకు బోర్డు నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు.

కేటాయింపులు:- 4 కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్‌ రోడ్డులో మోకాలిమెట్టు నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వరకు మిగిలి ఉన్న ప్రదేశంలో ఫుట్‌పాత్‌ షెల్టర్ల నిర్మాణం,,2.20 కోట్లతో తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో విద్యుత్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు,, 2.50 కోట్లతో తిరుమ‌ల‌లోని పిఏసి-1లో అభివృద్ధి పనులు,, 24 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల‌లో ర‌క్ష‌ణ గోడ‌ల నిర్మాణం,, తిరుప‌తిలోని శ్రీ‌నివాస సేతుకు గాను చివ‌రి విడ‌త‌గా 118.83 కోట్లను ప‌నులు పూర్తికాగానే చెల్లించ‌డానికి ఆమోదం,, 4.50 కోట్లతో శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వంట సరుకులను మరింత నాణ్యంగా పరిశోధించేందుకు వీలుగా అత్యాధునిక యంత్ర ప‌రిక‌రాలు కొనుగోలు,, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత భక్తులు వేచి ఉండేందుకు తిరుమ‌ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త‌ర‌హాలో 23.50 కోట్లతో యాత్రికుల వసతి భవనం నిర్మాణం,, త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, డ్యూటీ డాక్ట‌ర్లు, స్టాఫ్‌న‌ర్సులు, ఇత‌ర పారామెడిక‌ల్ సిబ్బంది నియామ‌కానికి అనుమ‌తి,,అదేవిధంగా 75.86 కోట్ల‌తో అత్యాధునిక‌ వైద్య‌ప‌రిక‌రాల కొనుగోలు,, తిరుప‌తిలోని శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌లో భ‌క్తుల స‌దుపాయం కోసం 3 కోట్ల‌తో స‌బ్‌వే నిర్మాణం,, 3.10 కోట్లతో శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్కింగ్‌ వసతి, మినీ కల్యాణకట్ట, ఫెసిలిటీ సెంటర్‌ తదితర అభివృద్ధి పనులు,, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో 11.50 కోట్లతో అదనపు అంత‌స్తు నిర్మాణం, 2.60 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ అభివృద్ధి పనులు, 3 కోట్లతో ఆయుర్వేద‌ కళాశాల విద్యార్థినుల హాస్టల్‌ భవనంలో అదనంగా మరో రెండు అంతస్తుల నిర్మాణం,, 2.20 కోట్లతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నూతన టిబిసిడి వార్డు నిర్మాణం,, 11 కోట్లతో ఎస్వీ సంగీత కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాలలో చదువుతున్న బాలురకు హాస్టల్‌ భవనం నిర్మాణం లాంటి వాటికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *