AMARAVATHI

విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన అంశం-పవన్

కేంద్ర ప్రకటన హర్షణీయం..

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుక పడ్డారు..విశాఖ ఉక్కును  కాపాడాలనే చిత్తశుద్ధి జగన్‌ ప్రభుత్వానికి లేదని విమర్శించారు..విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందన్న కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందని పవన్ కల్యాణ్‌ అన్నారు..విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన అంశమని,,32 మంది ప్రాణ త్యాగాలతో, ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ అని పవన్ అన్నారు..ఇంతటి ఘన చరిత్ర ఉన్నవిశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కేంద్రప్రభుత్వ యాజమాన్యం లోనే ఉండాలని అది జనసేన పార్టీ ఆకాంక్ష..ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి, ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకత్వానికి కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారన్నారు..విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకు ఉన్న భావోద్వేగాన్ని బంధాన్ని తెలియజేసి,,ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు..ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను, ఇప్పటికిప్పుడు ప్రైవేటు పరం చేయాలని కోవడం లేదు అని,,దీనిపైన ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదు అని ప్రకటించడం హర్షణీయమన్నారు.. రాష్ట్రంలో 3 వేల మంది కౌలురైతులు ఆత్మహత్యకు చేసుకున్నా,, జగన్‌ ప్రభుత్వంలో స్పందన లేదని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులకు సాయం చేయడంలోనూ కులకోణం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.. ఏపీలో 80 శాతం వరి పంట కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే అన్నారు.

ఇటీవల చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు..బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు..ఆస్పత్రుల్లో కనీస సదుపాయలు మెరుగుపరచని వైసీపీ నాయకులు,, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు..కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని మండిపడ్డారు..ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు..ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని,, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు.. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *