AMARAVATHIINTERNATIONAL

అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు ?-వ్లాదిమిర్‌ పుతిన్‌

5వ సారి అధ్యక్షుడిగా పుతిన్..
అమరావతి: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు..(ఈ నెల 15వ తేది నుంచి 17వ తేది వరకు) మూడు రోజులుగా జరుగిన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారంతో ముగిసింది..ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు సమాచారం వస్తొంది..రష్యాలోని 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు తరువాత ఈ విషయం స్పష్టం అయింది..దీంతో ఆయన 5వ సారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు..ఈ విజయంతో మరో 6 సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు..దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా “జోసెఫ్‌ స్టాలిన్‌”ను రికార్డులను అధిగమించనున్నారు..
అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు:- అమెరికాపై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ, అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదని అన్నారు..దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజయం సాధించిన అనంతరం అయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల యావ‌త్ ప్‌వపంచ దేశాలు న‌వ్వుకుంటున్నాయని పేర్కొన్నారు..తాము సైనిక చర్య తీసుకుంటున్న సంయ‌మ‌నంతో ఉక్రెయిన్ పట్ల వ్యవహరిస్తున్నమని,,అయితే అమెరికాలో మాత్రం విపత్తు ఉంద‌ని,, అది ప్ర‌జాస్వామ్య దేశం కాదని ఆరోపించారు.. అమెరికా ప్రభుత్వం త‌న వ‌ద్ద ఉన్న అన్ని అధికారాల‌ను వాడుకుని,,దేశాధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వ్య‌క్తిపై దాడి చేస్తోంద‌ని ఆరోపించారు..డోనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ప్ర‌భుత్వం వేధిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు..అభ్య‌ర్థి రేసులో ట్రంప్ ముందు వ‌రుస‌లో ఉన్నా,, ప్ర‌భుత్వం మాత్రం అయనను కేసులతో నిర్వీర్యం చేస్తోంద‌న్నారు..విదేశీ ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకోదని,, అమెరికా అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా వారితో ర‌ష్యా క‌లిసి ప‌నిచేస్తుంద‌న్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *