కూరగాయల మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు-నోటీసులకు ఆదేశించిన జె.సి కూర్మానాద్

నిజాయితీగా పనిచేయనిస్తారా ?
నెల్లూరు: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో తనిఖీల అనంతరం జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మానాద్ చర్యలకు ఉపక్రమించారు..కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్వయంగా నిర్ధారణ చేసుకున్న జె.సి,, విధి నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వర్తించలేదన్న కారణంతో ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ కార్యదర్శికి షోకాజు నోటీసు జారీ చేయాలని అలాగే మార్కెట్ సూపర్వైజర్ రియాజ్ కు మెమో జారీ చేయాలని మార్కెటింగ్ శాఖ ఏడి ని ఆదేశించారు. దీంతో వారికి నోటీసులు సిద్ధం చేస్తున్నారు.
(కూరగాయల మార్కెట్ లో అవకతవకలు నిరంతరం సాగిపోతునే వుంటాయి..వినియోగదారులు చేసే,కూరగాయల కొనుగొలుకు న్యాయం చేసేందుకు ఏ అధికారి చర్యలకు ఉపక్రమించిన,,రాజకీయ నాయకులను నుంచి ఒత్తిళ్లు రాత్రికి రాత్రే వస్తాయి అనేందుకు ఎలాంటి సందేహంలేదు..ఒక వేళ అధికారి నోటీసులు ఇచ్చిన,,మరో రెండు రోజుల్లో నిజాయితీగా వ్యవహారించే అధికారికి,,ఫోన్లు రావడం సర్వసాధరణం…అటు తరువాత షరా మాములే…అయితే గతంలో జాయింట్ కలెక్టర్ గా జిల్లాలో విధులు నిర్వహించిన రేఖారాణి,,ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా,వ్యవహారించడంతో,, కూరగాయాల మార్కెట్ లో వ్యాపారస్తుల దొపిడి,కొంత వరకు అదుపులోకి వచ్చిందనే విషయం నగర ప్రజలకు ఈ రోజుకు కూడా గుర్తు వుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..కొత్తగా బాధ్యతలు తీసుకుని అధికారిని నిజాయితీగా ప్రజల పక్షాన నాయకులు పనిచేయనిస్తారా ? లేదా ? అనేది వేచి చూడాలి???)