AMARAVATHINATIONAL

ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు,బెంగాల్ డి.జీ.పీపై కొరడా ఝలిపించిన ఈసీఐ

అమరావతి: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలకు ఉపక్రమించింది..ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు,,బెంగాల్ డి.జీ.పీలను విధుల నుంచి తొలగించింది..గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను,,మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శలను కూడా తొలగించింది..పశ్చిమ బెంగాల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌‌ని తొలగించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టింది..లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలకు విరుద్దంగ ప్రవర్తించే అధికారులను ఈసీ ఇలాంటి బదీలీలు చేపట్టడం సాధారణం..

ఇదే సమయంలో బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌తో పాటు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగిస్తున్నట్టు ఈసీ పేర్కొంది..ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది..మూడేళ్లు పూర్తి చేసుకున్న,,సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల సంఘం ఆదేశించింది..ఈ అదేశాలను ఆమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమైన నేపధ్యంలో,,ఈసీ నిర్ణయం వెలువడడం గమనించ తగ్గ ఆంశం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *