AMARAVATHIMOVIE

ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ ?

అమరావతి: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (81) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం..బిగ్ బి గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతుండ‌డంతో శుక్రవారం ఉదయం యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తొంది..అయితే ఇప్పటి వరకు అయన కుటుంబ సభ్యులు కాని వ్యక్తి గత PRO కాని ఆసుపత్రి వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు..పలు మీడియాల్లో ఈ వార్తలు రావడంతో బిగ్ బి అభిమానులు ఆయ‌న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *