హైదరాబాద్: మరో సినియర్ నటుడు చలపతిరావు(78) ఆదివారం వేకువజామున బంజారాహిల్స్ లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు..హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది..1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు..చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.. రవిబాబు ఆయన కుమారుడే..చలపతిరావు దాదాపు 1,200 పైగా సినిమాలలో నటించారు..బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.. చిరంజీవి:- చలపతిరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు..‘‘విలక్షణమైన నటుడు,,తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త కలచివేసిందన్నారు..ఎన్నో చిత్రాల్లో చలపతిరావుతో కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..రవిబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’’ అని చిరంజీవి తెలిపారు.