నెల్లూరు:శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో విచిత్రాలు చోటు చేసుకున్నాయని,,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, ప్రభుత్వం దివాలా తీసింది అన్న చందంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ అన్నారు.శనివారం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా అయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే బోధించు,సమీకరించు,పోరాడు అనే సిద్ధాంతాన్నిఅంబేద్కర్ చెప్పారని,,శ్రీధర్ రెడ్డి మాత్రం బెదిరించు, సమీకరించు,భుజించు అన్న విధంగా అమలుపరుస్తున్నారని ఎద్దేవా చేశారు.ముంపు ప్రాంతాల్లో జగనన్న కాలనీల పేరిట స్థలాలు ఇచ్చారని,,వావిలేటిపాడులో జన నివాసం ఉండలేరని తెలిసి కూడా అక్కడ కేటాయించారని ఇప్పుడు ఏవేవో దొంగ లెక్కలు చెబుతున్నారని విమర్శించారు.ఒక ప్రక్క దుర్మార్గమైన పనులు చేస్తూ దళితులపై దాడులు తెలబడుతూ మరో ప్రక్క సమాజంలో మరో అంబేద్కర్ లా మాట్లాడుతున్నారని, అసలు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత రూరల్ ఎమ్మెల్యేకి లేదన్నారు..మంత్రి బ్రిడ్జ్ ఓపెన్ చేయడం కోసం ప్రజల పొలాలను పణంగా పెట్టారని,, బ్రిడ్జ్ ఓపెనింగ్ తర్వాత నీటిని విడుదల చేసి 150 ఎకరాలు నీట ముంచారని ఆరోపించారు..వైసీపీ నేతల అక్రమాలపై జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాయబోతున్నామన్నారు.