x
Close
CRIME HYDERABAD

వివాదస్పదుడైన సి.ఐ నాగేశ్వరరావును సర్వీస్ తొలగించి పోలీసుశాఖ

వివాదస్పదుడైన సి.ఐ నాగేశ్వరరావును సర్వీస్ తొలగించి పోలీసుశాఖ
  • PublishedOctober 10, 2022

హైదరాబాద్: సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.విధి నిర్వహణలో తన అధికారంను అడ్డంపెట్టుకుని ఎన్నో ఆరచకాలకు పాల్పపడిన నాగేశ్వరావు లాంటి కలుపు మొక్కను పోలీసుశాఖ పీకిపారేసింది..వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో జైలుకెళ్లి ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు. నాగేశ్వరావుపై తీవ్రమైన నేరారోపణలు ఉండడంతో ఆర్టికల్ 311(2) B కింద సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు.నాగేశ్వరావును సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పోలీసు రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాయగా,,కమీషనర్ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది.ఇప్పటి వరకు పోలీస్ శాఖ హైదరాబాద్ లో 39 మందిని సర్వీస్ నుంచి తొలగించింది.

(గతం…జులై 6,2022న తన ఫాంహౌస్ లో పనిచేస్తున్న మహిళకు నాగేశ్వర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌ చేసి‌‌‌‌ తన లైంగిక కోర్కెలు తీర్చాలంటూ బెదిరించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నేరుగా హస్తినాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమెపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త, భార్య ఏడుపులు విని తలుపులు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పగులగొట్టి ఇంట్లోకి వచ్చి నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపై కర్రతో దాడి చేశాడు..దింతో రెచ్చిపోయిన నాగేశ్వరావు, రివాల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను బయటకు తీసి తాను చెప్పినట్లు వినకుంటే బ్రోతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు పెడతానని దంపతులిద్దరిని బెదిరించి ఓ కారులో ‌‌‌‌ఎక్కించి, వనస్థలిపురం నుంచి ఇబ్రహింపట్నానికి బయలుదేరాడు..కారు వెనుక సీట్లో బాధితురాలు కూర్చో పెట్టి, ముందు సీట్లో కూర్చున్న నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, బాధితురాలి భర్తను డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని రివాల్వర్ గురి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెట్టాడు. మార్గ మధ్యలో ఇబ్రహింపట్నం సమీపంలోని చెరువు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుని వనస్థలిపురం చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాధితుల ఫిర్యాదుతో నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు.) 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.