నెల్లూరు: పాత కక్షలు మనస్సులో వుంచుకుని,మద్యం మత్తు అనే సాకుతో రెండు నిండ ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన నెల్లూరు రూరల్ పరిధిలో అదివారం మధ్యహ్నం తెలుగు ఆఫీసర్స్ కాలనీ ప్రాంతంలో చోటు చేసుకుంది.సీటీ డీస్పీ తెలిపిన వివరాల ప్రకారం బేల్దారీ పనులు చేసుకునే శ్రీకాంత్ రెడ్డి,,రమణారెడ్డిలు,ఆటో నడుపుకునే రఫీలు స్నేహితులు ముగ్గురు కలసి తరుచుగా మందుకొడుతుంటారు.ఈ నేపధ్యంలో అదివారం మధ్యహ్నం దాదాపు 12.30 గంటల సమయంలో వీరు ముగ్గురు కలసి మద్యం త్రాగుతున్న సమయంలో,,గొడవ చెలరేగింది..కొపం పట్టలేకపోయిన రఫీ తన దగ్గర వున్న మారణాయుధంతో మొదట శ్రీకాంతపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు..గొడవ ఎందుకంటే అడ్డువెళ్లిన రమణారెడ్డిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు.దింతో రమణారెడ్డి అక్కడిక్కడే మరణించాడు. త్రీవగాయాలతో వున్న శ్రీకాంత్ రెడ్డిని స్థానికులు 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ కూడా మరణించాడు.సమాచారం అందుకుని ఘటన స్థలంకు చేరుకుని 5 పట్టణ సి.ఐ నరసింహరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నడని,నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని డీస్పీ పేర్కొన్నారు.