అమరావతి: శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు..ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది..ఈవిషయం తెలియడంతో శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో సంజయ్ రౌత్ ఇంటివద్దకు చేరుకొని,, ఈడీకి, కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ముంబైలోని పత్రా చాల్ భూ కుంభకోణం(రూ.1000 కోట్లు) కేసులో సంజయ్ రౌత్ తో పాటు ఆయన భార్,,, అనుచరుల లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి..ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రెండుసార్లు ఈడీ,,రౌత్ కు నోటీసులు ఇచ్చింది.. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున,, ఆగస్టు 7వ తేది తరువాతే విచారణకు వస్తానని రౌత్ స్పష్టం చేశారు. దీంతో స్వయంగా ఈడీ అధికారులే ఇవాళ అదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రౌత్ ఇంట్లో సోదాలు చేశారు..సోదాల అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు..మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈడీ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. మరోవైపు సంజయ్ రౌత్ సతీమణి వర్ష రౌత్‌కు, ఆయన ఇద్దరు సన్నిహితులకు చెందిన దాదాపు రూ.11,.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది.