x
Close
TECHNOLOGY

అన్ని ఫోన్ల ఒకటే ఛార్జర్​తో పనిచేసే విధానం దిశగా ప్రయత్నాలు-రోహిత్ కుమార్ సింగ్

అన్ని ఫోన్ల ఒకటే ఛార్జర్​తో పనిచేసే విధానం దిశగా ప్రయత్నాలు-రోహిత్ కుమార్ సింగ్
  • PublishedAugust 17, 2022

అమరావతి: మొబైల్ కంపెనీలు గతంలో లాగా ఫోన్ కొంటే,చార్జ్ ఫ్రీగా ఇచ్చే రోజులు పోయాయి..ఐ ఫోన్,ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారు తప్పని సరిగా రెండు రకాల చార్జర్స్  కొనాల్సిందే..అన్ని ఫోన్లు,ట్యాబ్ లకు ఒకే రకమైన చార్జర్ విధానాని అమెరికా,,ఐరోపా దేశాలు తప్పని సరి చేశాయి..దింతో సంబంధిత కంపెనీలు తమ మానుఫ్యాకర్చ్ విధానంలో మార్పులు చేసుకుంటున్నాయి..ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఒకటే ఛార్జర్​తో పనిచేసే విధానం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది..ఇందులో బాగంగా బుధవారం ఒక్కో డివైజ్​కు ఒక్కో రకం ఛార్జర్​ కాకుండా, అన్నింటికీ సింగిల్ ఛార్జర్ తీసుకొచ్చే అంశంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి మొబైల్స్, ల్యాప్​టాప్​ తయారీదారులు; సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు,, దిల్లీ ఐఐటీ,, వారణాసి ఐఐటీ నిపుణులు హాజరయ్యారు..డివైజ్​ను బట్టి ఛార్జర్లు మారే విధానం వల్ల ఈ-వ్యర్థాలు పెరిగి పర్యావరణంపై ప్రభావం పడుతోందని తయారీదారులు సైతం అంగీకరించారని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు..ఇదే సమయంలో ఈ అంశంపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డట్లు వెల్లడించారు..అన్నింటికీ ఒకటే ఛార్జర్ కాకపోయినా,, తొలి దశలో రెండు రకాల ఛార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని,, ఇందులో సీ-టైప్ ఛార్జర్ కూడా ఒకటని సమావేశం అనంతరం రోహిత్ పేర్కొన్నారు..ఇది చాలా సంక్లిష్టమైన విషయమని,,మనం నిర్ణయం తీసుకునే ముందు అందరి(తయారీదారులు, యూజర్లు, పర్యావరణం) వాదనల్నీ అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు.. భాగస్వామ్యపక్షాల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది,,అయితే వాటన్నింటినీ పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటు చేస్తాం,, మొబైల్, ఫీచర్​ ఫోన్స్​; ల్యాప్​టాప్స్​, ఐప్యాడ్స్​,, వేరబుల్స్,, ఎలక్ట్రానిక్ డివైజెస్​,, ఇలా మూడు విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు..ఆయా బృందాలను ఈ నెలలోనే నోటిఫై చేస్తామని,,రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలు అందజేస్తాయని మీడియికు వివరించారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.