NATIONAL

EWS రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించలేదు-సమర్థించిన సుప్రీంకోర్టు

అమరావతి: EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.EWS రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ U.U లలిత్ నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది సమర్థించారు.EWS రిజర్వేషన్ల కల్పన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.103వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటును బెంచ్ సమర్థించింది. జస్టిస్ లలిత్ మరియు మహేశ్వరి అభిప్రాయాలతో జస్టిస్ బేల ఎం త్రివేది ఏకీభవించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, సామాజిక వెనుకబాటుతనం కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఈ రిజర్వేషన్లు కల్పించారని,కులం, మతం, జాతి ఆధారంగా వివక్షకు గురైనవారికి కల్పించాల్సిన స్థానంలో ఆర్థిక వెనుకబాటుతనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది డిస్మిస్ చేశారు.సోమవారం తుది తీర్పు ఇస్తు, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్‌లు కల్పన సరైనదేనని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది అన్నారు.EWS కోటా కోసం 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందని, ఇది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని,EWS కోటా చెల్లుబాటు అవుతుందని జస్టిస్ దినేష్ మహేశ్వరి చెప్పారు. రాజ్యాంగబద్ధమైనది అనే జస్టిస్ మహేశ్వరి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు. EWS కోటాను జస్టిస్ యుయు లలిత్ సమర్థించారు. సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి EWS రిజర్వేషన్లు కల్పించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లను మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్ర ప్రభుత్వం వాదన.EWS రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని కేంద్రంప్రభుత్వం స్పష్టం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *