ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో మాజీమంత్రి నారాయణకు సుప్రీమ్ కోర్డులో ఉరట

అమరావతి: టీడీపీ మాజీ మంత్రి,నారాయణ విద్యాసంస్ధల అధిపతి పొంగూరు.నారాయణకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసులో సుప్రీమ్ కోర్టులో ఉరట సోమవారం లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పలు అవకతవకలకు పాల్పపడ్డారంటూ,రాష్ట్ర ప్రభుత్వం నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.దింతో నారాయణ హైకోర్టులో ముందస్తూ ధరఖాస్తు చేసుకోవడంతో బెయిల్ లభించింది.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.సుప్రీమ్ కోర్టులో సోమవారం జరిగిన వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది రింగ్ రోడ్,అలైన్ మెంట్,భూసేకరణలో చట్ట విరుద్దంగా పలుసార్లు మార్పులు చేశారని సుప్రీమ్ దృష్టికి తీసుకుని వచ్చారు.విచారణ సంస్థలకు మాజీ మంత్రి సహాకరించడంలేదని,ఈ విషయం హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లిన విన్పించుకోకుండా,ముందస్తూ స్టే ఇచ్చిందన్నారు. దర్యాప్తుకు సహకరించకపోతే, సంబంధిత హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా అంటూ జస్టిస్.గవాయ్,జస్టిస్ నాగత్నం కూడిన ధర్మాసనం వ్యాఖ్యనించింది. ప్రతీకార రాజకీయల విషయాల్లోకి కోర్టులను లాగవద్దని హెచ్చరించింది.రాష్ట్రప్రభుత్వం వేసిన పిటీషన్ ను తొసిపుచ్చింది.
హైదరాబాద్: తెలంగాణలో MLAల కొనుగొలు వ్యవహరంలో ఆక్రమంగా కేసులు బనాయించారని, MLAల కొనుగొలు చేశారంటూ పోలీసులు,రాష్ట్ర ప్రభుత్వం కలసి,తమ నాయకులపై ఆక్రమ కేసులు పెట్టారంటూ,సుప్రీమ్ కోర్టుకు చేరుకుని వ్యవహారంలో,ఇరుపక్షలను ఉద్దేశించి,సుప్రీమ్ ధర్మాసనం,ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.రాజకీయ కారణలతో,కోర్టులను ఇలాంటి వ్యవహారాల్లో లాగవద్దంటూ హెచ్చరించింది.