AMARAVATHINATIONAL

భారతదేశానికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు- రష్యా

భారత్ కు ప్రేమతో రష్యా..
అమరావతి: భారతదేశం గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) సందర్భంగా రష్యా రాయబార కార్యాలయం భారతదేశానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసింది..హిందీ సినిమా అయిన గద్దర్ లోని పాటకు చిన్నారుల డ్యాన్స్ చేసే వీడియోను సోషల్ మీడియా(ట్వీట్టర్) ఎక్స్ లో పోస్ట్ చేసింది..1 నిమిషం 29 సెకండ్లు వున్న వీడియోలో పిల్లలు,,డ్యాన్సర్లు,,ఉద్యోగులు ఉన్నారు..ఓ రష్యన్ బైకర్ రావడంతో డ్యాన్స్ ప్రారంభిస్తారు..ఓ రష్యన్ అమ్మాయి మధ్యలో ఉండి డ్యాన్స్ ప్రారంభించారు.. భారతీయ డ్యాన్సర్ల మాదిరిగా డ్యాన్స్ చేశారు..కొందరు పిల్లలు వెనకాల ఉండి భారత జాతీయ జెండా పట్టుకొని ఊపారు..చివరలో కొందరు హ్యాపీ రిపబ్లిక్ డే అని ఫ్ల కార్డులను పట్టుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రేమతో రష్యా:- భారతదేశానికి ప్రేమతో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ‘రిపబ్లిక్ డే సందర్భంగా హృదయపూర్వక అభినందనలు,, భారతీయ స్నేహితులకు మంచి జరగాలి,,భారత్ దేశానికి అమృత్ కాల్ శుభాకాంక్షలు…భారత్-రష్యా స్నేహం ఇలాగే కొనసాగాలి అని’ ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *