x
Close
DISTRICTS

L.R.S గడువు పొడిగింపు-కమిషనర్ శ్రీమతి హరిత

L.R.S గడువు పొడిగింపు-కమిషనర్ శ్రీమతి హరిత
  • PublishedNovember 16, 2022

నెల్లూరు: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువును 2023వ సంవత్సరం జనవరి నెల 31వ తేదీ వరకు పొడిగించారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లే అవుట్ యజమానులకు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సచివాలయ వార్డు ప్లానింగ్ రెగులేషన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో 384 అనధికార లే అవుట్లను గుర్తించి, వాటికి పాటర్న్స్ తయారుచేసి డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారి అనుమతులకై ఫార్వార్డ్ చేశామని తెలిపారు. అందులో 134 లే అవుట్ పాటర్న్స్ లకు అనుమతులు లభించాయని, 10 పాటర్న్స్ కు అనుమతులు రద్దు చేశారని తెలిపారు. అదేవిధంగా అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 1294 అర్జీలు అందుకున్నామని, వాటిలో 216 ప్లాట్లకు అనుమతులు మంజూరు చేశామని, 167 ప్లాట్ల మంజూరు తిరస్కరించామని తెలిపారు.139 అప్లికేషన్లు షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ కోసం పంపించామని, 740 అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. సచివాలయ వార్డు ప్లానింగ్, రెగులేషన్ కార్యదర్శులు తమ పరిధిలోని లే అవుట్ల ను గుర్తించి ఎల్.ఆర్.ఎస్ పై యజమానులకు అవగాహన కల్పించాలని, అనధికార లే అవుట్లలో ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.