హైదరాబాద్: తమిళ దర్శకుడు మణిరత్నంకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.. దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు కొంత హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంటున్నాయి..అలాగ రీకవరీ రేటు కూడా బాగానే వుంది..ఈ నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ వచ్చే సెప్టెంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడంతో గత వారం టీజర్ లాంచ్ చేశారు..ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నంతోపాటు మూవీ టీమ్ కీలక సభ్యులందరూ పాల్గొన్నారు..టీజర్ విడుదల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించక పోవడం వల్లే మణిరత్నంకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..మణిరత్నంకు కరోనా లక్షలు స్వల్పంగా వున్నప్పటికి ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..