AMARAVATHIMOVIE

అట్టహసంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు-ఉత్తమ నటీ,నటులుగా అలియా-రణ్ బీర్

అమరావతి: బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 69వ ఎడిషన్ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది..గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన ఈ వేడుకలో 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డ్స్ ప్రకటించారు.. ఈ జాబితాలో ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది..ఈ చిత్ర దర్శకుడు విధు వినోద్ చోప్రా బెస్ట్ డైరెక్టర్ అవార్డున సొంతం చేసుకున్నాడు..బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్,, అలియాభట్ ల జంట ఉత్తమ నటుడు,, నటి అవార్డులు గెలుచుకున్నారు..యానిమల్ చిత్రానికి గానూ రణ్ బీర్ కపూర్ ను ఉత్తమ నటుడు అవార్డు వరించింది..రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ చిత్రానికి గానూ అలియాభట్ ఉత్తమ నటిగా ఎంపికైంది..ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్ (డంకీ), ఉత్తమ సహాయ నటిగా షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ) ఎంపికయ్యారు.
అవార్డుల విజేతలు:-
ఉత్తమ చిత్రం : 12th ఫెయిల్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : జొరామ్
ఉత్తమ నటుడు : రణ్ బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్)
ఉత్తమ నటి : అలియాభట్ (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు : విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
ఉత్తమ గీత రచయిత : అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. : జరా హత్కే జరా బచ్చే)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బం : యానిమల్
ఉత్తమ నేపథ్య గాయకుడు : భూపిందర్ బాబర్ (అర్జన్ వెయిలీ – యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయకురాలు : శిల్పా రావు (చెలెయ్ – జవాన్)
ఉత్తమ కథ : అమిత్ రాయ్ (OMG 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్ : ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్ దావరే ( త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
బెస్ట్ ఎడిటింగ్ : జస్కున్వర్ సింగ్ కోహ్లీ- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
బెస్ట్ సౌండ్ డిజైన్: కునాల్ శర్మ (Mpse) (సామ్ బహదూర్), సింక్ సినిమా (యానిమల్)
బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (వాట్ జుమ్కా?- రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
బెస్ట్ యాక్షన్ : స్పిరో రజాటోస్, అన్ల్ అరసు, క్రెయిగ్ మాక్రే, యాన్నిక్ బెన్, కెచా
ఖంఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
బెస్ట్ వీఎఫ్ఎక్స్ : రెడ్ చిల్లీస్ Vfx (జవాన్)
బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్: తరుణ్ దూదేజా (ధక్ ధక్)
బెస్ట్ డెబ్యూ మేల్ : ఆదిత్య రావల్ (ఫరాజ్)
బెస్ట్ డెబ్యూ ఫీమేల్: అలిజే అగ్నిహోత్రి (ఫారీ)
లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు: డేవిడ్ ధావన్లు అందుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *