వివిధ వర్గాల వారికి ఉరటను ఇచ్చే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు..ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు..స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.. నూతన పన్నుల విధానం ద్వారా రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను ఉండదు..రూ.3-రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 5% పన్ను ఉంటుంది. రూ.6 – రూ.9 లక్షలు ఆదాయం ఉన్న వారికి 10 % పన్ను ఉంటుంది. రూ.9 -రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 15%, రూ.12 -రూ.15 లక్షల ఆదాయం ఉన్న వారికి 20%, రూ.15 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి 30% పన్ను ఉండనున్నది..దీంతో వేతన జీవులను ఊపశమనం కల్గించారు..కేంద్ర బడ్జెట్ లో 7 ప్రాధాన్య అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు..బడ్జెట్ ప్రవేశపెడుతూ సమ్మిళిత వృద్ధి, దేశంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడం, మౌలిక సదుపాయాలు కల్పించడం-పెట్టుబడులు, అన్ని వర్గాల వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, పర్యావరణసహితంగా ఆర్థిక అభివృద్ధి సాధించడం, దేశంలోని యువ శక్తి, దేశ ఆర్థికాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు..
రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు (మూలధన వ్యయం) కేటాయించారు..ఇది 2013-2014లో (UPA హయాంలో) ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కన్నా తొమ్మిది రెట్లు అధికం..గత ఏడాది దేశంలో 400 వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతామని ప్రకటించింది.. గత సంవత్సరంతో పోల్చికుంటే ఈ సారి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అధికంగా కేటాయించారు..ప్రస్తుత బడ్జెట్ ను దేశంలో రైళ్లు ఇంజన్లు, సరుకు రవాణా, అధునాతన కోచ్‌లు, సాంకేతికత, ట్రాకుల పునరుద్ధరణ, గేజ్ మార్పిడి, డబ్లింగ్, కొత్త లైన్ల కోసం ఉపయోగిస్తారు.. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు భారీగా కేటాయింపులు చేశారు.. 63,000 సొసైటీల కంప్యూటరీకరణ కోసం రూ.2,516 కోట్లు కేటాయించారు..దేశంలో ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహం కోసం “గోవర్ధన్” జాతీయ పథకాన్ని తీసుకురానున్నారు..మహిళల కోసం మరిన్ని పథకాలను కేంద్రం ప్రకటించింది..81 లక్షల సెల్ప్ హెల్ గ్రూపులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు..దేశంలో రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లు కేటాయించింది..
బడ్జెట్ అనంతరం చౌకాగా మారినున్న వస్తువులు కొన్ని:- బొమ్మలు,,సైకిల్,,టీవీ,,మొబైల్,,ఎలక్ట్రిక్ వాహనం,, ప్రయోగశాలలో తయారు చేయబడిన డైమండ్స్,,బయోగ్యాస్ సంబంధిత వస్తువులు,,మొబైల్ ఫోన్లు, కెమెరా లెన్సులు,,ఎలక్ట్రిక్ వాహనాలు,,ఆటో మొబైల్స్,,ఎల్‌ఈడీ (లెడ్) టీవీ,,
బడ్జెట్ అనంతరం ఖరీదైనవి కొన్ని:- బంగారం, వెండి, వజ్రాలు,ప్లాటినం,,గృహాల విద్యుత్ చిమ్నీలు,,వెండి పాత్రలు,,దేశీ కిచెన్ చిమ్నీ,,విదేశాల నుంచి వచ్చే వెండితో తయారు చేసిన 6 ఖరీదైన వస్తువులు,,సిగరెట్లు,, దిగుమతి చేసుకున్న తలుపులు,,