DISTRICTS

ఈ నెల 15 నుంచి 61 రోజులు  సముద్రంలో చేపల వేట నిషేధం: జిల్లా కలెక్టర్

తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేసే మెకనైజ్డ్,,మోటారు బోట్ లు ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు పాటు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటాయని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణరెడ్డి తెలిపారు.. చేపల వేట నిషేధం ఉద్దేశ్యం:- వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు,రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రత్సహించడం, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాదించడo కోసమన్నారు. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు( మెకనైజ్డ్,మోటారు బోట్ల ) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు.నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసినట్లయితే ఆయా బోట్ల యజమానులు ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టము (AP MFC  Act) 1994, సెక్షన్ (4) ను క్రింద శిక్షర్హులన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించి బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకొవడంతో పాటు జరిమానా విధిస్తు, డీజీల్, ఆయిల్ రాయితీ, ప్రభత్వం అందించే అన్ని రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. వేల నిషిద్ధంను ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ , కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవి,రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమయినదని, మత్స్యకారులు అందరు సహకరించవలసినదిగా కలెక్టర్ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *