జిల్లాలో కొత్తగా నాలుగు ఇసుక రీచ్ లు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో నాలుగు ఇసుక రీచ్ లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఇసుక రీచ్ లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.తొలుత బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు, అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు, విడవలూరు మండలంలోని ముదివర్తి,, ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ ల వివరాలను మైన్స్ అండ్ జియాలజీ అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రీచ్ ల వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజల అవసరాల మేరకు త్వరితగతిన ఇసుక సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ డిడి సిహెచ్ సూర్య చంద్ర రావు, ఏడి శ్రీనివాసరావు, భూగర్భ జల శాఖ డి డి శోభన్ బాబు, ఇన్చార్జి ఆర్టీవో కే మురళీమోహన్, డిపిఓ చిరంజీవి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.