NATIONAL

డిశంబరు వరకు ఫ్రీ రేషన్ బియ్యం-ఉద్యొగులకు 4 శాతం డిఏ పెంపు

అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద కేంద్రం అందస్తున్న ఫ్రీ రేషన్ బయ్యంను మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదితో ఫ్రీ రేషన్ గడువు ముగియనున్న నేపధ్యంలో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.కొవిడ్-19 కారణంగా లాక్ డౌన్ 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో పథకం గడువు ముగియాల్సి ఉంది.అయితే పేద,బడుగు వర్గాల అర్ధిక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని, సెప్టెంబర్ 30 వరకు పొడగించారు. తాజాగా మరో 3 నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా 80 కోట్లకుపైగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు.

4 శాతం DA పెంపు:- పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. ఉద్యోగులకు చెల్లించే DA 4 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల 38 శాతానికి చేరునుంది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు కేంద్రం 3 శాతం DA పెంచింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *