“లతా మంగేష్కర్ చౌక్” ను ఏర్పాటు చేసిన సీ.ఎం యోగీ

అమరావతి: వెండితెర నేపధ్యగాయాని లతా మంగేష్కర్ కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. ఆమె 93వ జయంతి సందర్భంగా యోగి ప్రభుత్వం, లతా మంగేష్కర్ స్మారకార్థం ‘లతా మంగేష్కర్ చౌక్ ’ను ఏర్పాటు చేసింది. రూ.7.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కూడలిని,బుధవారం కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ కూడలిలో 14 టన్నుల బరువు, 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తున్న వీణను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఈ స్థాయి భారీ సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ తెలిపారు. లతా మంగేష్కర్ దేశం గర్వించదగ్గ గాయకురాలని, ఆమె స్మారకార్థంగా చౌక్ ను ఏర్పాటు చేయడం చాలా గర్వంగా వుందని సీఎం యోగి ఆదిత్యనాధ్ పేర్కొన్నారు.