మహా కార్తీక దీపోత్సవం సందర్బంగా భక్తులతో నిండిపోయిన గణేష్ ఘాట్

నెల్లూరు: కార్తీక మాసం సందర్బంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఇరుకళపరమేశ్వరీ దేవాస్థానం వద్ద వున్న గణేష్ ఘాట్,మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమంతో వేల సంఖ్యలో భక్తులతో పూర్ణమైంది.సోమవారం సాయంత్రం ప్రారంభంమైన మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమం వేకువజాము వరకు సాగింది.కార్యక్రమంను ఉద్దేశించి రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి. శ్రీధర్ రెడ్డి,ముఖ్య అతిధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.ప్రవచన కర్తలు గరికపాటి.నరసింహరావు, పరిపూర్ణనందలు భక్తులకు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ప్రభోధించారు.వివిధ సంస్కృతిక కార్యక్రమాలు,గంగహారతి కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.నెల్లూరుజిల్లా చరిత్రలో ఈ స్థాయిలో స్వర్ణాల చెరువు వద్ద ఇలాంటి కార్యక్రమం జరగడం తొలిసారి.ఇందుకు నిర్వహకులను అభినందిచాల్సిందే..