బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించిన గవర్నర్ తమిళసై

హైదరాబాద్: ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని,, సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించానని గవర్నర్ తమిళి చెప్పారు..గవర్నర్ ఆదివారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుని క్యాంపస్ మొత్త పరిశీలించారు..విద్యా బోధన, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు..అలాగే హాస్టల్ గదులు, వాష్ రూంలను పరిశీలించారు..విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చారు..అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ ఎక్కడా అమలు కావడం లేదన్నారు..తాను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వచ్చానని, ఆహారం విషయంలో విద్యార్దులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు..సెక్యూరిటీ సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అధ్యాపకుల పోస్టులు భర్తీతో సహా నిర్ణత వ్యవధిలో,,ప్రణాళిక ప్రకారం సమస్యలను పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు..