TECHNOLOGY

ఎస్ఎస్ఎల్వీ  ప్రయోగం విఫలం అయింది-ఇస్రో

అమరావతి: ఇస్రో నుంచి అదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు SSLV – D1 ద్వారా చేపట్టిన ప్రయోగం మూడు దశలు విజయవంతం అయినప్పటికి,,నాల్గవ దశలో రెండు ఉపగ్రహాలను 356 కిలోమీటర్ల “దీర్ఘ వృత్తాకార” కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా,, వాటిని 356 కిలోమీటర్ల “వృత్తాకార” కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని పర్యావసనం EOS-02 మిషన్ విఫలమైందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది..ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది..ఇకపై ఈ ఉపగ్రహాలు పని చేయవని, సెన్సర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది..ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ దీనిపై తుది నివేదిక ఇస్తుందని ఇస్రో తెలిపింది.. ప్రస్తుత ప్రయోగంలోని లోపాలను సరిదిద్ది, కమిటీ ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే SSLV – D2 ప్రయోగం చేపడతామని పేర్కొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *