SSLV-D1 ప్రయోగం విజయవంతం-ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి?-సోమనాథ్

అమరావతి: ఇస్రో నుంచి అదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు నింగిలోకి SSLV – D1ను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు..SSLV-D1లో చిన్న పాటి సాంకేతిక సమస్య ఏర్పడిందని,, గ్రౌండ్ టెర్మినల్ కు సంబంధించిన సమాచారం రావడానికి ఆలస్యమైందని అయన పేర్కొన్నారు..ప్రస్తుతం రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని,,ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయో లేదో పరిశీలించాలన్నారు. ప్రయోగ పురోగతిపై త్వరలోనే సమాచారం ఇస్తామని ఇస్రో చైర్మన్ చెప్పారు..