AMARAVATHI

అని అనూకూలిస్తే త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్ల పరుగులు?

అమరావతి:  వందేభారత్‌ రైళ్లు తెలుగురాష్ట్రాల్లో పరుగులు పెట్టించేదుంకు అధికారులు సన్నాహాకాలు చేస్తున్నారు. స్పీడ్ ట్రైయిన్స్ వేగానికి తగ్గట్లుగా ట్రాక్‌ సామర్థ్యం పెంచారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఆ వందేభారత్‌ రైళ్ల సేవాలు ప్రయాణికులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లో చేరుకునే వీలుంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా,విజయవాడ మార్గాన్ని రైల్వేశాఖ హైడెన్సీటీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకుని వచ్చారు.దింతో 130 కీటోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ సామర్ధ్యం పెరిగింది.ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే ఈ ట్రయిన్ ను నడిపిస్తారా లేక తిరుపతి వరకు పొడిగించలా అనే విషయంలో అధికారులు సాధ్యసాధ్యాలపై లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఈ మార్గంలోనే వందేభారత్‌ రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.వందేభారత్ ట్రైయిన్స్ సాధరణంగా పగటి పూట మాత్రమే ప్రయాణిస్తాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *