NATIONAL

విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలి-ప్రధాని మోదీ

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సు..

అమరావతి: విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలని,,ప్రయోగశాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..మంగళవారం మహారాష్ట్రలోని రాష్ట్రసంత్‌ తుకాదోజీ మహారాజ్‌ నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సును వర్చువల్ ప్రారంభించారు..అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు..అంతర్జాతీయ మిల్లెట్స్ (తృణ ధాన్యాల) సంవత్సరంగా ప్రకటించిందని, భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్పిని సైన్స్ వినియోగంతో మరింత మెరుగుపరచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు..సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగడం,, సైన్స్ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు..21వ శతాబ్దంలో భారతదేశంలో మనకు రెండు విషయాలు కనిపించాయని,,డేటా, టెక్నాలజీ అని వివరించారు..ఇవి భారతదేశ విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవన్నారు..డేటా విశ్లేషణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు..సైన్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ నిలవడం గర్వకారణమని తెలిపారు..ప్రస్తుతం స్టార్టప్‌లలో భారతదేశం ప్రపంచంలోని మొదటి 3 దేశాలలో ఒకటిగా ఉందని ప్రధాని మోడీ వివరించారు..2015 వరకు 130 దేశాల గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ లో 81వ స్థానంలో ఉన్నామని,,అయితే 2022 నాటికి 40వ స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *