x
Close
NATIONAL

కొలీజియంలో ప్రభుత్వ తరపున ప్రతినిధులను కూడా స్థానం కల్పించాలి-కిరణ్ రిజిజు

కొలీజియంలో ప్రభుత్వ తరపున ప్రతినిధులను కూడా స్థానం కల్పించాలి-కిరణ్ రిజిజు
  • PublishedJanuary 16, 2023

అమరావతి: న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కొలిజియంలో బృందంలో, ప్రభుత్వ తరపున ప్రతినిధులను కూడా స్థానం కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు..ఈ విషయమై సీజేఐ చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లేఖ రాశారు.. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని,,అందుకే కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలంటూ కిరణ్‌ రిజిజు లేఖలో వివరించారు..న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమంటూ కొద్దిరోజుల క్రితమే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మళ్లీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది..ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఈ సందర్బంపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు కంటే, చట్టాలు చేసే పార్లమెంట్‌ అత్యున్నతమైనది అంటూ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది..2014లో కేంద్రం తీసుకుని వచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (NJAC) బిల్లును సుప్రీమ్ కోర్టు కొట్టేయడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందంటూ విమర్శించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.