AMARAVATHIDEVOTIONAL

ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రాహామోత్సవాలు

అమరావతి: ఎన్నికల కోడ్ అమలు పక్కాగా పాటిస్తూ, ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రాహామోత్సవాలు, కల్యాణ మహోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు..సోమవారం నిర్వహించిన సమావేశ:లో కలెక్టర్  మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. 

** *బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు..*

ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్ప‌ణ‌** *17వ తేదీన ఉదయం – ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ** *18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహన సేవ** *19న ఉదయం  – వటపత్రశాయి అలంకారము, సాయంత్రం – సింహ వాహన సేవ** *20న ఉదయం – నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం – హనుమత్సేవ** *21న ఉదయం – మోహినీ అలంకారము, సాయంత్రం – గరుడసేవ** *22న ఉదయం – శివధనుర్భంగాలంకారము, సాయంత్రం – కళ్యాణోత్సవము(సా.6.30- రా.8.30)/ గజవాహనము** *23న ఉదయం – రథోత్సవం** *24న ఉదయం –  కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం – అశ్వవాహన సేవ** *25న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం.*26న సాయంత్రం  – పుష్ప‌యాగం జరుగుతాయన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *