న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయి-సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

అమరావతి: న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయని,,పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిగతగతిన పూర్తి చేయకపోతే,,న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని,,ఈలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు..శనివారం విజయవాడలోని కోర్టుల భవన సముదాయన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు..అనంతరం అయన ప్రసంగిస్తూ న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలను నా శక్తి మేరకు పూరించానని వెల్లడించారు..సమాజంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైనదని,,ప్రజలకు న్యాయం అందించటంలో వారు మరింత కృషి చేయాలని సూచించారు..కేసుల వాదనలు విషయాల్లోను తీసుకోవాల్సిన పలు కీలక పాయింట్ల విషయాల్లో సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు సూచనలు ఇస్తూ వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు..విశాఖలో కూడా కొన్ని భవనాలు పూర్తి చేయాల్సి ఉందని,,వేదికపై ఉన్న సీఎం జగన్ కు గుర్తు చేశారు..విజయవాడ నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగణంలో సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది అంతస్తుల భవనాన్ని నిర్మించారు.. 2013 మే 13నే ఈ భవన సముదాయానికి శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావటానికి 9 సంవత్సరాలు పట్టింది..కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలకుపైగా నిర్మాణం నిలిచిపోయింది.. ఈ విషయంపై పలువురు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడంతో,, న్యాయస్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది..ఎట్టకేలకు 3.70 ఎకరాల్లో తొమ్మిది అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది..జిల్లాలోని 31 కోర్టులు ఒకే చోటకు ఉండడం వలన బాధితులకు ప్రయాస తప్పతుందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రాంతంకు చెందిన వారు కావడం,వారి చేతుల మీదుగా కోర్టు భవనాల నిర్మాణకు పునాదులు వేసి నేడు అదే కోర్టు భవనాలు ప్రారంభించడం గుర్తు వుంచుకోతగ్గరోజున్నారు.