AMARAVATHIDISTRICTS

పక్కాగా అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయండి-కమిషనర్ వికాస్

ఏమో! ఎన్నికలు ఎప్పుడైన రావచ్చు??

(తెలంగాణతో పాటు రాష్ట్రంలోను ముందస్తూ ఎన్నికలు జరిగేందుకు ఆవకాశలు వున్నయంటూ జాతీయ మీడియాతో పాటు రాష్ట్రంలోని మీడియా నిన్నటి నుంచి హడవిడి చేస్తోంది..దిని వెనుక వున్న నేపద్యం…బుధవారం సీ.ఎం జగన్,,ప్రధానమంత్రి,,హోం మంత్రులను కలవడమే…రాష్ట్రానికి రావల్సిన నిధులు,,పలు పథకాల కోసంమే ప్రధాన మంత్రిని కలవడం జరిగిందని,,ముందస్తూ ఎన్నికలకు వెళ్లె ఆలోచన లేదంటూ వైసీపీ ఎం.పీ మిథున్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు..అయితే ఉహాగానలకు మాత్రం పుల్ స్టాప్ పడలేదు..జిల్లా అధికార యంత్రగం,,ఓటర్ల నమోదు కార్యక్రమం పక్కాగా చేయాలంటూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు..దింతో ప్రజల్లో ముందస్తూ ఎన్నికలంటూ వస్తున్న వార్తలపై గందరగోళం నెలకొంది.)

నెల్లూరు: ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటు హక్కు లేని అర్హులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూపర్వైజర్ లను కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. ఎన్నికల అధికారులు,  సూపర్ వైజర్లతో నగరపాలకసంస్థ కార్యాలయంలోని ఏ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా రూపొందించడంలో కేంద్ర ఎన్నికల  సంఘం నిర్దేశించిన విధి విధానాలను అనుసరిస్తూ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు, యాక్షన్ ప్లాన్ రూపొందించెలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ అందించి క్షేత్ర స్థాయిలో వారి సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్లు – జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, కొత్త ఓటర్ల నమోదు, వివిధ క్లయిముల పరిష్కారం, గత ఓటర్ల జాబితాతో నేటి జాబితా పోలిక, యువ ఓటర్ల తగ్గుదలను భర్తీ చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ఏ.ఈ.ఆర్.ఓ లు దృష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్లు – జనాభా నిష్పత్తిలో  ఉన్న తేడాను తగ్గించేందుకు, ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వ తేదీ వరకు గడప గడపకు తిరిగి తద్వారా ఓటర్ల గుర్తించి నమోదుకు ప్రజలను చైతన్యపరిచి, 18 సంవత్సరాలు దాటిన అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న 6, 7, 8  క్లైయిమ్ ఫారాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, బూత్ స్థాయి అధికారులను   క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓ లు నిర్మాలనంద బాబా, శ్రీనివాసులు, దేవీ కుమారి, మాధవి,దశయ్య, చక్రపాణి ,సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *