AMARAVATHI

కోర్టుల నుంచి చంద్రబాబుకు దక్కని ఉపశమనం

అమరావతి: చకోర పక్షుల ఎదురు చూస్తున్న టీడీపీ శ్రేణులకు సుప్రీమ్,,ఏసీబీ కోర్టుల నుంచి దుర్వవార్త వినాల్సి వచ్చింది..ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు సుప్రీమ్ కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబరు 3వ తేదికి వాయిదా పడింది..స్పెషల్ లీవ్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది..అయితే బెంచ్ లోని తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి(జస్టిస్ వెంకట నారాయణ భట్టి) విచారణకు విముఖత చూపించారు.. సంజీవ్ ఖన్నా బెంచ్ లో వున్న జస్టిస్ భట్టి,,నాట్ బిఫోర్ మీ అన్నారు..దీంతో మరో బెంచ్ కు పిటిషన్ ను బదిలీ చేశారు..తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది..ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు లాయర్ లూథ్రా,,మరో ధర్మాసనం లేదా సీజేఐ ధర్మాసనం ఇప్పుడే విచారించాలని ఆయన కోరారు..దీంతో పిటిషన్ విచారణను సీజేఐ ధర్మాసనం టేకప్ చేసింది..కేసు విచారణను అక్టోబర్ 3వ తేదికి వాయిదా వేసింది..విచారణను మరో బెంచ్ కు బదిలీ చేస్తామని సీజేఐ ధర్మాసనం తెలిపింది..అక్టోబర్ 3వ తేదిన అన్ని విషయాలు వింటామని తెలిపింది..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు:- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది..
ఏసీబీ కోర్టు:- విజయవాడ ఏసీబీ కోర్టు,, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై అక్టోబర్ 4వ తేదికి వాయిదా వేసింది..స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్ వేయగా,,చంద్రబాబును మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్ల పిటిషన్ వేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *