AMARAVATHIDISTRICTSSPORTS

మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన శాప్ ఎం.డి హర్షవర్ధన్

అమరావతి: శాప్ ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా గ్రామం నిర్మాణం కోసం జరుగుతున్న పనులను రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ & ఎం.డి హర్షవర్ధన్ మంగళవారం పరివేక్షించారు..నెల్లూరు రూరల్ పరిధిలో వున్న 150 ఎకారల స్థలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖోలో ఇండియా పథకం క్రింద మంజూరైన రూ.8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేసి,వీలైనంత తొందరలో ఇండోర్ స్టేడియంను వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.సంబంధిత నిర్మాణ సంస్థకు చెందిన చీప్ ఇంజినీరు(Central Public Works Dept.),,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  APEWIDC నెల్లూరు,,జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిఇఓ పుల్లయ్య,, చీప్ కోచ్ యతిరాజ్,,విజయకుమార్ తదితరులతో సమావేశమై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *