AMARAVATHITECHNOLOGY

43 సెకండ్లు ఆలస్యంతో లూనా-25 విఫలం అయింది-ఏజెన్సీ డైరెక్టర్ యూరి బోరిసోవ్

అమరావతిం రష్యా 50 సంవత్సరాల తరువాత చంద్రునిపైకి ప్రయోగించిన స్పేస్ మాడ్యూల్ లూనా-25 విఫలం కావడంతో ఈ వెస్ట్రన్(పశ్చిమదేశాలు) మీడియా సంస్థలు స్పేస్ టెక్నాలాజీ పూర్తిగా విఫలమైందటూ వార్త కథనాలను ప్రచురించాయి..నేటి వరకు స్పేస్ టెక్నాలాజీలో రష్యాకు తిరుగులేదు..రష్యా స్పేస్ మాడ్యూల్ లూనా-25 చంద్రుడిపై దగ్గరకు చేరుకునే సమయంలోనే అది దారి తప్పింది..ఇలా జరగడానికి గల కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ తాజాగా వెల్లడించింది..నిర్దేశిత సమయంలో ఆ మాడ్యూల్ లోని ఇంజిన్లు ఆఫ్ కాలేదని, దాంతో లూనా-25 అనుకున్న కక్ష్యను దాటి మరో కక్ష్యలోకి వెళ్లిందని సదరు ఏజెన్సీ డైరెక్టర్ యూరి బోరిసోవ్ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వులో తెలిపారు. సరైన సమయానికి ఇంజిన్లు ఆఫ్ కాకపోవడం వల్ల అది కుప్పకూలిందని తెలిపారు..తాము ముందుగా డిజైన్ చేసిన సమయానికి ఇంజిన్ 84 సెక్లనలో ఆఫ్ కావాలని, అయితే ఆ ప్రక్రియ జరిగేందుకు 127 సెకన్లు పట్టిందని, ఫలితంగా చంద్రుని ఉపరితలంపై అది నియంత్రణ కోల్పోయి కూలిందని బోరిసోవ్ పేర్కొన్నారు..ఈ ప్రయోగం ఫెయిల్ కావడానికి గల ఇతర కారణాలను తెలుసుకోవడం కోసం తాము మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నమని,, ఇందుకోసం ఒక ప్రత్యేక కమీషన్ని ఏర్పాటు చేశామని తెలిపారు..ప్రొపల్ష న్ సిస్టమ్ లో మిషన్ ఆపరేషన్ అనుకున్న సమయానికి జరగలేదని, లూనార్ ఆర్బిట్ నుంచి వ్యోమనౌక ముందుకు వెళ్లిందని చెప్పారు..ఈ మూన్ మిషన్ విఫలమైనప్పటికీ,,తమ స్పేస్ ఇంజినీర్లు విలువైన అనుభవాన్ని గ్రహించారన్నారు..ఈ మిషన్ లో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని,,భవిష్యత్తులో లూనా-26, 27, 28 మిషన్లు తప్పకుండా విజయవంతంగా ప్రయోగిస్తామన్నధీమా వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *