సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి

1అమరావతి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం మృతి చెందారు.వయస్సు రీత్యా వచ్చే ఆనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులగా గురుగావ్ లోని మేధాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం చాలా బాధాకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ములాయం మృతి సోషలిజంలో ఓ పోరాట యుగానికి ముగింపు అని, ములాయం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు..ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం పట్ల ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ములాయం మరణం పట్ల ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు…ములాయం సింగ్ రాజకీయ జీవితం ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగింది.10 సార్లు ఎమ్మెల్యేగా,,7 సార్లు లోక్సభ ఎంపీగా సేవాలు అందించారు..1989లో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.