AMARAVATHINATIONAL

దేశద్రోహ చట్టం (IPC సెక్షన్ 124A) ను కొనసాగించాలి-లా కమిషన్

అమరావతి: దేశద్రోహ చట్టం (IPC సెక్షన్ 124A) క్రింద కేసుల నమోదు కొనసాగించాలని విశ్రాంత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ ఈ సిఫారసు చేసింది..దేశ ఐక్యత, సార్వభౌమాధికారాలను పరిరక్షించడంతో పాటు రాడికలైజేషన్ ను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది..దేశద్రోహ చట్టం (IPC సెక్షన్ 124A) క్రింద కేసుల నమోదు నిలిపి వేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది..IPC సెక్షన్ 124Aను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియచేసింది..దీనిపై రివ్యూ చేసి ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది..ఈ నేపథ్యంలో లా కమిషన్ (శాసన పరిశీలన సంఘం) స్పందిస్తు,,దేశద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని,,శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలంటూ స్పష్టం చేసింది..
భారత శిక్షా స్మృతి(IPC)లోని సెక్షన్ 124Aకు కొన్ని సవరణలు అవసరమని ప్రభుత్వానికి 22వ శాసన పరిశీలన సంఘం (ప్రస్తుత లా కమిషన్) సిఫారసు చేసింది..ఈ చట్టం కింద నేరస్థులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని ప్రస్తుత నిబంధనలు చెప్తున్నాయని,,వాటిని ఏడేళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.. ఈ చట్టం దుర్వినియోగమవుతోందనే వాదనలపై స్పందిస్తూ అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ సూచించింది..నేర శిక్షా స్మృతి (CRPC) సెక్షన్ 196(3)కి సారూప్యమైన నిబంధనను CRPC సెక్షన్ 154లో చేర్చాలని సిఫారసు చేశారు. IPC సెక్షన్ 124A క్రింద నేరానికి సంబంధించిన FIR దాఖలుకు ముందు అవసరమైన విధానపరమైన రక్షణ కోసం ఇటువంటి నిబంధనను చేర్చాలని తెలిపారు..IPC సెక్షన్ 124A చాలా విస్తృతమైనదని,, దీని పరిధిలోకి వచ్చే నేరాలు ఇతర చట్టాల పరిధిలోకి రావని పేర్కొంది..దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే నిబంధనలు బ్రిటిష్ పాలనా కాలంలో వచ్చాయని, భారత దేశ స్వాతంత్ర్య సమర యోధులపై ఈ చట్టాన్ని ప్రయోగించారని కారణలు చూపిస్తూ రద్దు చేయాలని కోరడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.. దీనిని రద్దు చేయడానికి అవి సరైన కారణాలు కాదని తెలియచేస్తూ ఆ మాటకు వస్తే భారతీయ న్యాయ వ్యవస్థలో మొత్తం వలస పాలన వారసత్వమే ఉందని వ్యాఖ్యనించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *