ఐస్ లో నిల్వ వుంచిన చికిన్,మటన్,చేపలను హోటల్స్ కు అమ్మి,సోమ్ము?

తిరుపతి: గూడూరులో హస్పటల్ వీధిలోని చికెన్ దుకాణాలపై మున్సిపల్ కమీషనర్ సాయినాధ్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.. దాడులలో ఓ దుకాణంలో 600 కేజీల నిల్వ చేసిన పురుగులు పట్టిన చికెన్ ను గుర్తుంచారు..పురుగులు పట్టిన చికెన్ ను పలు హోటల్స్, ఢాబాలకు అమ్మకాలు..చెన్నై నుంచి తొలుత గూడూరుకు, ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి పెద్ద మొత్తంలో నిల్వ చికెన్ తరలిస్తారు..కొంత తక్కవ రేటుకు వీరు హోటల్స్, ఢాబాలకు అందచేస్తుంటారు.తక్కవ ధరకు వస్తుంది కాబట్టి, హోటల్స్, ఢాబాల యాజమానులు,వీటిని వేడి వేడిగా కస్టమర్స్ కు సప్లయ్ చేస్తుంటారు.ఈ చికెన్,మటన్,చేపలు తిన్నవారికి అదృష్టం బాగుంటే,పెద్దగా ఎఫెక్ట్ వుండదు,ఒక వేళ వాళ్ల టైమ్ బాగలేదంటే,వాంతులు,విరేచనాలత హస్పటల్స్ పరుగులు తీస్తుంటారు..ఇలా ఐస్ పెట్టి కుళ్లిన చికెన్,మటన్ ను గతంలో నెల్లూరులోని పేరు మోసిన హటల్స్ లో అప్పటి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ పట్టుకునప్పటికి,పై నుంచి ఒత్తిడిలతో,,షరా మాములే..గూడూరు కమీషనర్ కొత్తగా పోస్టింగ్ లోకి వచ్చాడు కాబట్టి,షాపుకు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేశారు.ఇలాంటి చర్యలతో నిర్వహకులు మళ్లీ ఇలాంటి వ్యాపారం చేయకుండా అగిపోతారా ?