బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించిన సింధు

అమరావతి: కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధు స్వర్ణం పతకం సాధించింది..సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు ఆఫెన్స్ గేమ్ తో కెనడాకు చెందిన మిచెల్లీ లీపై 21-15, 21-13 తో నెగ్గింది..దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది..కామన్వెల్త్ క్రీడల్లో సింధుకు ఇదే తొలి స్వర్ణం..2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది..ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి..సింధు విజయంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా అభినందించారు..అలాగే సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు..