AMARAVATHIDISTRICTS

జిల్లాలో పక్కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి-కలెక్టర్‌,

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను జిల్లా ఎస్పీ ఆరీప్‌ హఫీజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు వారం ముందే ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. సి`విజిల్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 257 ఫిర్యాదులు రాగా ఫిర్యాదు వచ్చిన 100 నిమిషాల్లోనే పరిష్కరించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో నగదు, మద్యం, ఇతర వస్తువుల తరలింపుపై ప్రత్యేక దృష్టిపెట్టామని, జిల్లావ్యాప్తంగా 18 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టామన్నారు.
రూ.1.96 కోట్ల విలువైన సామాగ్రిని సీజ్‌:- :జిల్లాలో ఇప్పటివరకు 1200 లీటర్లు రూ.7.50 లక్షలు విలువైన మద్యం, 92 లక్షల నగదు, 88 లక్షల బంగారు, వెండి, 7 లక్షలు విలువైన ఇతర వస్తువులను మొత్తం రూ.1.96 కోట్ల విలువైన సామాగ్రిని సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *