AMARAVATHIPOLITICS

వెటకారాలు, వ్యంగాలు వద్దు…బాథ్యతతో పని చేయండి-పవన్ కల్యాణ్

అమరావతి: రాబోయే ఎన్నికలలో జనసేన బలమైన శక్తిగా ఎదిగేందుకు జనసైనికులు కృషి చేయాలని,,టీడీపీతో కలిసి వెళుతున్నాం. చిన్న ఇబ్బందులు వచ్చినా,,సర్దుకుని ముందుకు వెళ్లేలా అందరూ పనిచేయాలని పార్టీ నేతలకు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు..మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీల సభ్యుల సమావేశంలో వారికి నియామక పత్రాలను పవన్ కళ్యాణ్ అందచేసిన చేశారు..అనంతరం జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన అసెంబ్లీలో ఉండే విధంగా పని చేయాలని కోరారు.. కేవలం జనాదరణతోనే ఇంతవరకు జనసేన నడిచిందని,, 6.30 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా పార్టీ సత్తా చాటుతొందన్నారు..ప్రజల భవిష్యత్ ను బంగారు మయంగా చేసే విధంగా కృషి చేద్దాం అన్నారు..ప్రజల్లో ఉన్న భావనను గమనించి, రిపోర్టులు తెప్పించుకుని,,టీడీపీతో కలిసి వెళుతున్నాం,,వైసీపీ పోవాలి,,జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడేలా ముందుకు వెళదాం అని అన్నారు..సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు,,అయితే దాని కోసం వెంపర్లాడను,,నాకు సీఎంగా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటాం,, ప్రజల కోసం ఆదర్శపాలన అందిద్దాం అని పవన్ కల్యాణ్ అన్నారు.. “వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ పేరుతో కోట్లు దోచుకుంది.. 3,,5 తరగతి పిల్లలకు టోఫెల్ అంటే అర్దం అవుతుందా…ఇంగ్లీష్ మీడియం పేరుతో ఇన్ని వేలకోట్లు ఖర్చు అవసరమా? బ్రిటీష్ తరహా ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప… ఎదగమనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు…అలాగ అయితే అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ఏ ఇంగ్లీష్ మాట్లాడతారు…మంత్రి బొత్స కూడా బ్రిటీష్ తరహా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రి అయ్యారా? పిల్లల్లో సృజనాత్మకతను గుర్తించి…క్రియేటీవిటీ నాలెడ్జ్ ను పెంచాలి…ఇంగ్లీష్ నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయా? అలా అయితే అమెరికాలో పేద వాళ్లే ఉండకూడదు కదా? అంటూ వ్యాఖ్యనించారు..సి.బి.యస్.ఇ విద్యా విధానం కూడా కొన్ని పాఠశాలల్లో తొలగించారు…ప్రభుత్వం అవగాహనంతో చేస్తుందా? స్కాం కోసమే చేస్తుందా? బొత్స కూడా మమ్మలను కించపరిచేలా మాట్లాడటం కాదు…విద్యార్దులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటామా? 2024 ఎన్నికలలో ప్రభుత్వం మారిన వెంటనే,,ఈ స్కాంను వెలుగులోకి తెస్తాం… అరెస్టులు చేస్తాం…బై జ్యూస్ నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారంపై విచారణ చేయిస్తాం…విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న తరువాత ఉల్లంఘన జరిగితే? పరిణామాలు తీవ్రంగా ఉంటాయి…మంత్రి బొత్స స్పందించాలి… దీనిపై స్పష్టత ఇవ్వాలి… మీపై గౌరవం ఉంది…వెటకారాలు, వ్యంగాలు వద్దు…బాథ్యతతో పని చేయండని పవన్ కల్యాణ్ సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *