AMARAVATHIMOVIE

తమిళ హీరో,DMDK అధినేత విజయ్ కాంత్ కన్నుమూత

అమరావతి: తమిళ హీరో,, DMDK అధినేత విజయ్ కాంత్ (71) గురువారం ఉదయం మరణించారు..గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు..ఇటీవల (నియోనియా) ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న అయనను కుటుంబ సభ్యులు నవంబరు 18వ తేదిన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు..చికిత్స అనంతరం అయన కోలుకొవడంతో డిశంబరు 11వ తేదిన డిశ్చార్జి చేశారు..మళ్లీ మంగళవారం పరిస్థితి విషయంగా మారడంతో మియాట్ ఆసుపత్రిలో చేర్పించారు..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కాంత్ గురువారం ఉధయం మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి..
విజయ్ కాంత్ 1952 ఆగష్ట్ 25వ తేదిన మధురైలో జన్మించారు..అయన ఆసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి.. 27 సంవత్సరాల వయస్సులో సినీపరిశ్రమలోకి అడుగు పెట్టిన విజయ్ కాంత్,,తనదైన శైలితో తమిళ సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు..ఆయన తన సినిమాల్లో ఎక్కవగా పోలీస్ ఆఫీసర్ గానే కనిపించారు..విజయకాంత్ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తరువాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలవడం ప్రారంభించారు.. విజయ్ కాంత్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి..దీంతో విజయ్ కాంత్ కు తెలుగునాట కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.. 2005 సెప్టెంబర్ 14వ తేదిన DMDK పార్టీని స్థాపించి రాజకీయాల దిశగా తన ప్రయాణం సాగించారు.. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు..విజయ్ కాంత్ మరణంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *