AMARAVATHIPOLITICS

వైసీపీ పతనం నెల్లూరుజిల్లా నుంచే మొదలైంది-టీడీపీ నేతలు

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణాయలపై టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు..మంగళవారం నెల్లూరు నగరంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో కీలక నేతలు సమావేశం అయ్యారు.. నెల్లూరులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు,, నారా లోకేష్ యువగళం పాదయాత్రపై జరుగుతున్న తీరుపై చర్చించారు..అనంతరం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు..

మాజీ మంత్రి పొంగూరు నారాయణ:- మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు, ఎక్కడ పోటీ చేయమని చెబితే అక్కడ పోటీ చేస్తానని,,2024లో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు..తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరులోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు..ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులు టీడీపీలోకి రావడం చాలా సంతోషకరమన్నారు..

అబ్దుల్ అజీజ్:- పరిస్థితులు మారిపోతాయి,,రాజకీయాలు మారుతాయని నిర్వేదంగా అన్నారు..జగన్ ప్రభుత్వంపై ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారని పేర్కొన్నారు. సర్వేపల్లి, నెల్లూరు, రూరల్, యువగలం పాదయాత్ర విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని వెల్లడించారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర బాధ్యతలు తనకు అప్పగించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు..నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జీ అబ్దుల్ అజీజ్ సలహా సూచనలు తీసుకుని, కార్యకర్తలను కలుపుకుని లోకేష్ పాదయాత్ర విజయవంతం చేస్తామన్నారు..

అమర్నాథ్ రెడ్డి:- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీ గెలుస్తుందని అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అజీజ్ కు తగిన స్థానం వుంటుందన్నారు.ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అజీజ్ కు సంబంధించి అన్ని విషయాల్లో న్యాయం చేస్తారన్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి:- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషమన్నారు. రాబోయే కాలంలో టీడీపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. వైసీపీ పార్టీ పతనం నెల్లూరు నుండే మొదలైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులుకు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు..అనిల్.. అరే.. తొరే కాకుండా రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. కాకాణి మంత్రి అయ్యాక పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యే లు బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్, గిరిధర్ రెడ్డి, సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *